Categories
హిందూ మహా సముద్రం మధ్యలో ,భారత దేశానికి కాస్త దగ్గరలో ఉంటుంది ద్విపకల్పం మాల్దీవులు . తెల్లని వన్నెతో మెరిసే ఇసుక దిబ్బలు ,బీచ్ లు ,పగడాల దిబ్బలు వీటన్నింటి లో ఇది భూమిపై వెలసిన స్వర్గం . ఏడాది మొత్తం అనుకూల మైన వాతావరణం ఉంటుంది . అనేక అంతర్జాతీయ హోటల్ చెయిన్స్ పూర్తి ద్వీపంవెంబడి రిసార్ట్ చక్కని బీచ్ లు నగర జీవనంలో ఒత్తిడి నుంచి సేదతీరుస్తాయి . డిసెంబర్ నుంచి మార్చి వరకు పొడి ఈశాన్య వర్షఋతువు ,ఈ రెండే సీజన్లు . రెస్టారెంట్స్ భారతీయ రుచులు దొరుకుతాయి ఇడ్లీ ,వాడితో సహా . హనీ మూన్ లకి ఇదొక స్వర్గధామం .