అభిమానులు నాపట్ల చూపే ప్రేమ,అభిమానం నాకెంతో ప్రోత్సహాన్ని ఇస్తూ ఉంటుంది . ఇది బేషరతు ప్రేమ,ఇటువంటి వృత్తిలో నేను కొనసాగటం నా అదృష్టం గా భావిస్తాను . అందుకే ప్రేక్షకులను అబ్బుర పరిచే విధానాలు ఎంచుకొంటాను . ఏదో నాకు సౌకర్యవంతమైన ఇమేజ్ బాక్స్ లో ఇరుక్కోవాలని నేను కోరుకొను . హద్దులు లేని నటనావకాశాలు నాకు రావాలని కోరుకొంటాను అంటోంది అదితి రావ్ హైదరి. హార్డ్ వర్క్ ,క్రమశిక్షణ,త్యాగాలు ఇవన్నీ ఈ పీల్డ్ లో తప్పవు నా పనిని నేనెంతగానో ప్రేమిస్తాను కాబట్టి ఇవన్నీ కష్టాలు అనిపించవు . ఫ్యాషన్ స్టయిల్ గా ప్రత్యేకంగా ఉండాలని నేను కోరుకొను . స్టయిల్ స్వతహాగా రావాలి . ఇది ఎక్స్ టెన్షన్ వంటిది కాదు . నా కెరీర్ లో నా వర్క్ ప్రతి రోజు క్రీడాప్రాంగణం లోకి వెళ్ళినట్లే ఉంటుంది అంటోంది అదితి రావ్ హైదరి.ఒక క్రీడాకారులు ఆటను అంతులేని దీక్షతో ఆడుతున్నట్లే ఉంటుంది నా కెరీర్ నాకు .