ప్రతి రోజు ఒక దోర జామ పండు తింటే చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాక వృద్దాప్య లక్షణాలు నెమ్మదై ,కళ్ళకింద ముడతలు ,మొటిమలు మాయం అవుతాయి అంటున్నారు డాక్టర్స్ . వీటిలో ఉండే పీచు, విటమిన్-ఎ ,ఫోలిక్ ,ఆమ్లాలు,పొటాషియం ,కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలం. మనకు తెలిసిన ఎరుపు, తెలుపే కాకుండా ఎన్నో రుచుల్ని సంకరీ కరించటం ద్వారా జామ ఎన్నో రకాలుగా పండుతుంది . ఆపిల్ ,సర్దార్,లలిత్ ,బిట్టిదార్ ఆర్క్ మృదుల,సఫెద, కోహిర్ రకాల జామపండ్లు ఎంతో రుచి ,గింజలు తక్కువ ,గుజ్జు ఎక్కువ . గులాబీ రంగు గుజ్జులో పెద్దసైజ్ లో కాసే అలహాబాద్ సుర్ఖజామ అయితే తియ్యగా మంచి సువాసనతో ఉంటుంది . ఏ రకాలైన,ఏ రుచితో ఉన్నా పోషకాలు మాత్రం మారలేదు .

Leave a comment