మయూరి సినిమా సుధాచంద్రన్ ఆత్మకథ . చిన్న వయస్సు లోనే కాళ్ళు పోగొట్టుకొని ,జైపూర్ ఫుట్ తో మళ్ళి నృత్యకళాకారిణిగా స్టేజ్ మీద అవతరించిన సుధాచంద్రన్ కధ కోట్లమందికి ఆదర్శం . ఆ వయసులో శారీరకంగా,మానసికంగా ఎంతో కష్టపడి ఆ వైకల్యం లోంచి బయట పడ్డాను . నువ్వు ఎందరికో స్ఫూర్తి ,మరి నీకెవరు స్ఫూర్తి అంటారు నన్ను కలిసేందుకు వచ్చిన వాళ్ళు . నా వైకల్యమే నాకు స్ఫూర్తి అంటాను . దాని నుంచే నేను జీవిత పాఠాలు నేర్చుకున్నాను అంటుంది సుధాచంద్రన్. బుల్లి తెరకు వచ్చి తమిళం, హిందీ, మలయాళం,భోజ్ పురి తదితర భాషల్లో బిజీ అయ్యాను ఎన్నో సీరియల్స్ ,డాన్స్ షోలలో న్యాయ నిర్ణేతగా ఉన్నాను . దీనివెనుక కష్టం అంత మా అమ్మ తంగందే . ఆమె నాకోసం ఎన్నో త్యాగాలు చేసింది . ఆమె లేనిదే మయూరి లేదు అంటుంది సుధాచంద్రన్ .