మారథాన్ పరుగుకు చీరెకట్టు అడ్డం కాదని నిరూపించారు అంకిత కోన్వస్ . పింక్ ధాన్ 8 వ ఎడిషన్ లో ఆమె సంప్రదాయ సిద్దమైన అస్సాం చీరెకట్టు తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు . అంకిత కోన్వస్ ప్రముఖ మోడల్ ,పిట్ నెస్ గురుమిచింద్ సోమన్ భార్య . ఇలాటి మారధాన్స్ తో అందరూ జాగింగ్ ట్రాక్స్ వేసుకొంటారు . కానీ అంకిత వినూత్నాంగా చీరెకట్టు తో పాల్గొన్నారు . పింక్ ధన్ లో భాగంగా 10 కీ .మీ దూరాన్ని 64 నిముషాల్లోనే ముగించి చీరె కూడా మారథాన్ పరుగుకు సౌకర్యంగానే ఉంటుందని నిరూపించింది. అంకిత చీరెకట్టుతో ఈ పింక్ ధన్ లో పాల్గొనడం ద్వారా నేను అస్సోం మహిళలతో ఉన్నానని పించింది . నేను వారికి దూరంగా ఉన్నానన్న విషయం మనసులో దూరం అయింది అంటోంది అంకిత .