Categories
సౌందర్య సాధనాల మార్కెట్ వందలకోట్లు దాటుతుంటే హీరోయిన్ తమన్నా మటుకు వీటి పైన అస్సలు అదరపడను అంటోంది . తినే తిండి పైన శ్రద్ద పెడతాను . న్యూట్రిషనిస్ట్ సలహాలు తీసుకొంటాను . మెరిసే చర్మానికి కాస్మొటిక్స్ కంటే క్రమశిక్షణ ముఖ్యం . ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండటం ఏడూ నించి ఎనిమిది గంటల నిద్ర సానుకూల దృక్పధంలో ఉండటం నా క్రమశిక్షణ లో భాగం . నా దృష్ఠి లో ఫ్యాషన్ అంటే గుడ్డిగా అనుకరించేది కాదు . అది మన అవగాహన కు సంబంధించింది కొత్తగా కనిపించాలని అనుకొంటాను . ఫ్యాషన్ కు సంబందించిన ఆర్టికల్స్ అన్ని చదువుతాను . నన్ను నేను అప్డేట్ చేసుకొంటాను . అదే నా నాజూకు తనం ,శరీరాకృతి,అందం రహస్యం అంటోంది తమన్నా .