Categories
హోటల్ కి వెళ్ళి కప్పు కాఫీ తాగినా టిప్పు ఇవ్వటం అందరికీ అలవాటే అయితే జపాన్ లో మటుకు టిప్పు ఇస్తే తప్పు. అక్కడ కష్టమర్స్ కి నచ్చేలా సేవ చేయటం సర్వర్ల బాధ్యత గా అనుకొంటారు. అసలు వాళ్ళ ఉద్యోగం అదే కనుక ఎప్పుడు వాళ్ళకి టిప్పు ఇవ్వక్కలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా టిప్పు ఇచ్చే అలవాటు ఉంది కానీ ఒక్క జపాన్ లోనే ఇందుకు మినహాయింపు. అక్కడ స్థానికులు ఎవ్వరు టిప్పు ఇవ్వరు. విదేశీయులైనాసరే అలవాటు చొప్పున టిప్పు ఇవ్వబోతే సర్వర్లు వద్దండీ అని మర్యాదగా చెపుతారట. అలాటి పద్ధతి ఇక్కడ వస్తే బావుంటుందికదా !