Categories
ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా బరువు తగ్గిస్తామని భారీ ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు . శరీరంలోని కొవ్వును అతివేగంగా తగ్గిస్తామని కొన్ని సప్లిమెంట్స్ మార్కెట్ లోని తెచ్చేశారు . అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు తగ్గించే సప్లిమెంట్స్ పాత్ర పరిమితం . శరీరం లోపలి పరిస్థితి బయట ఉంటే పరిస్థితులు సమతౌల్యం తో ఉంటేనే సత్పలితాలు ఉంటాయి . వాస్తవంలో క్రమశిక్షణ ఒక్కటే బరువు తగ్గించ గలుగుతుంది . శరీరానికి ఏం కావాలో ఏ సమయంలో తినాలో ఆ సమయంలో అవి అందాలి . అన్నీ రకాల పోషక పదార్దాలు తీసుకొంటూ శారీరక శ్రమ చేస్తేనే ఫిట్ నెస్ గా సరైన బరువు తో ఉండటం సాధ్యమవుతుంది .