ఏదైనా అవుట్ డోర్ ట్రిప్ ,లేదా పార్టీకి వెళ్ళి ఒక రోజంతా అక్కడే గడప వలసిన అవసరం వస్తే జీన్స్ ధరించాలి అంటారు ఎక్స్ పర్డ్స్ . దాని పై చిక్ టాప్ ,లెదర్ జాకెట్ స్మార్ట్ నెస్ ఇస్తుంది . సాధారణ కుర్తీతో పాటు లాంగ్ జాకెట్ కూడా చాలా స్టయిల్ గా ఉంటుంది . పలాజో ధోతి ఫ్యాంట్ తో కుర్తీ వేసుకున్నా ,బెల్ బాటమ్ జీన్స్ తో కుర్తీ వేసుకున్నా స్టయిల్ లుక్ సొంతం అవుతుంది . క్రాప్ టాప్ ని శారీ లేదా ధోతి ప్యాంట్ తో బ్లౌజ్ గా వేసుకొన్నా బావుంటుంది . అలాగే సీక్వెన్స్ ,లేయర్స్ ఎప్పుడు అందంగానే ఉంటాయి . తేలికైన జ్యువెలరీ ,వదిలేసిన శిరోజాలు చాలా ఆకర్షణీయంగా చూపెడతాయి . కొన్ని గంటల పాటు పార్టీలో ఉండవలసి వస్తే సౌకర్యంగా ఉండే డ్రస్ నే ఎంచుకోవాలి .

Leave a comment