Categories
చిన్నపిల్లలకు తల్లి దండ్రలు కొనిచ్చే బొమ్మల్లో అమ్మాయిలకు బార్బీ బొమ్మలు ,టెడ్డీబేర్ లాంటి ఆటవస్తువులు అబ్బాయిలకు కార్లు ,బైక్ లు లాంటి ఇస్తున్నారంటే ఆ వయసులోనే లింగ వివక్షకు బీజం పడినట్లే అంటున్నారు అధ్యయనకారులు . బాలబాలికలను మానసికంగా వేరు చేస్తున్నట్లే అని గుర్తించాలంటున్నారు . ఏ అంశం లోను లింగ బేధం లేకుండా వాళ్ళు కేవలం పసివాళ్ళు అన్న దృక్పధం లోంచే చూడాలి . పని ప్రదేశాల్లో కూడా ఈ కారణం చేతనే డ్రస్ కోడ్ విధించి,స్త్రీ పురుషులు ఒకేరంగు ,డిజైన్ లు ధరించాలని చెపుతారు . పిల్లల మనస్సులో తాము ప్రత్యేకమైన వాళ్ళు అన్న ఆలోచన రాకుండా పెంచాలి అంటున్నారు అధ్యయన కారులు .