Categories
బాక్స్ బ్రీతింగ్ వ్యాయామంలో వత్తిడి తగ్గిపోతోంది అంటారు ఎక్స్ పర్ట్స్. దీన్ని ఆఫీస్ లో కూడా కూర్చున్న చోట నుంచే చేయచ్చు. వెన్నెముక నిఠారుగా ఉండేలా సౌకర్యంగా ఉన్న కుర్చీలో కూర్చోవాలి. పదాలు నెలకు ఆనించాలి. కళ్ళు మూసుకోవాలి ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి ఊపిరి తిత్తుల్లోకి గాలి వెళుతూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఒకటి నుంచి నాలుగు అంకెలు లెక్క పెట్టాలి శ్వాసను కాసేపు నిలిపి మళ్ళా ఒకటి నుంచి నాలుగు వరకు లెక్క పెట్టాలి. నోరు తెరవకుండ లోపే శ్వాస బయటికి వదలాలి. ఇలా రోజుకి రెండు నుంచి నాలుగు సార్లు చేస్తే ఒత్తిడి తగ్గిపోతోంది. శ్వాసని కొద్ది సెకండ్లు నిలిపి వదులుతూ చేసే ఈ బ్రీతింగ్ ఎక్సరసైజ్ తో భుజాలపైన వెన్నముక పైన ఒత్తడి తగ్గిపోతోంది శరీరం రిలాక్స్ గా ఉంటుంది.