నిద్రించే సమయంలో ,చదువుకునేప్పుడు చుట్టు కొన్ని పరిమళాలు ఉండేలా చూసుకొంటే జ్ఞాపక శక్తి ,అధ్యయన శక్తి పెరుగుతుంది అంటున్నారు పరిశోధకులు . సాధారణంగా రుచిచూడటం ,వినటం ,వాసన పీల్చటం ,స్పర్శ ద్వారానే చుట్టూ పక్కల జరిగే అనేక విషయాలు అనుభవం లోకి వస్తాయి . అలా నేర్చుకొన్నవి కొన్ని ఎక్కువకాలం గుర్తుంటాయి కొన్నింటిని మరచిపోతాం ,అయితే జ్ఞాపకం ఏదైనా మనసులో నిక్షిప్తం కావాలంటే అది నిద్రపోయే సమయంలో అంటారు పరిశోధకులు . దానికి సువాసనతో తోడ్పడతాయి . మెదడులో భావోద్వేగాలు జ్ఞాపకం శక్తి కి సంబందించిన ప్రాంతాలకు వాసన గ్రంధులు చాలా దగ్గరగా ఉంటాయి అందుకే చక్కని పరిమళం నిద్ర పట్టేలా చేస్తుంది . అలాగే చదివే సమయంలో సువాసనలు మెదడులో సువాసన గ్రంధులు యాక్టివ్ గా ఉండేలా చేసి చదివిన విషయాలు గుర్తుండేలా చేస్తాయంటున్నారు .
Categories