పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి జరిగిన యద్థంలో ఒక రాక్షసుడు పుట్టాడు.వాడిని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సంధించాడు కాని అది వెనుదిరిగి వచ్చినది.
శివుడు తన త్రిశూలానితో ప్రయత్నం చేసాడు కానీ అదీ స్వామి వద్దకు తిరిగి చేరింది.రక్కసుడు వికటాట్టహాసంతో శ్రీమహావిష్ణువు, శివుని వెంటబడ్డాడు.వారిరువురు తమని ఆదిశక్తే కపాడాలని శరణు వేడుకున్నారు.
ఆదిశక్తి లక్ష తలకాయలతో అవతారమెత్తి ఆ రాక్షసుడిని వాడి సైన్యాన్ని హతమార్చింది.ఊపిరాడకుండా చేసింది.ప్రత్యంగిరా దేవీ అని భక్తులు ఆ అవతారం చూసి భయపడి పారిపోయారు.ఈ దేవతకి ప్రత్యేకంగా దేవాలయం అంటూ లేదు కానీ వ్యాధులు వచ్చినప్పుడు తప్పకుండా స్మరిస్తూ పూజలు నిర్వహిస్తారు.
ఆవు పేడతో అలికి ముగ్గు వేయటం,
నిమ్మకాయలు,వేప చిగుర్లు తినటం.
-తోలేటి వెంకట శిరీష