Categories
నల్లగొండ జిల్లా చింత పల్లి మండలంలో ౮౦.౭
మంది జనాభా ఉన్న గ్రామం మామదనాపురం హైదరాబాద్ హై వే కి దగ్గరలో ఉంటుంది .ఎంతోమంది ప్రజలు ఏవో కారణాలతో మా పల్లిలోకి వస్తూ ఉండటం చూశాము .వారికి ఆపాలంటే ముళ్లకంచి వేయటమే మార్గం అనుకొన్నా .మా గ్రామం ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం .గ్రామంలో యువతను సమీకరించి కంచె వేసుకొన్నాం .మేమే అందరం కలసి కాపలాగా ఉన్నాం .కొన్ని గంటలు నేనే గస్తీ కాశా అంటోంది .ఆ ఊరి మహిళా సర్పంచ్ ఉడతలు అఖిల యాదవ్ .గ్రామంలో పారిశుద్ధ్యం చేపట్టి ఊరంతా బ్లీచింగ్ ద్రావకాలను చల్లించాను .ప్రభుత్వం చెప్పిన అన్ని జాగ్రత్తలు మా గ్రామ ప్రజలు ఖచ్చితంగా పాటిస్తున్నారు .ప్రధాన రహదారి మూసేసి , ఓ చిన్న దారిని మా అవసరమైన రాకపోకలకు వాడుతున్నాము అంటోంది యువ సర్పంచ్ .అందరూ ఇంత శ్రద్ద గా ఉంటే కరోనని పారద్రోలటం ఎంత పని ?.