Categories
మనసులోని భావోద్వేగాలను కళ్ళు చక్కగా స్పందిస్తాయి .సంతోషం వచ్చినా దుఃఖం కలిగినా కన్నీళ్లు వచ్చేస్తాయి .మన సమాజంలో కన్నీళ్లను బలహీనమైన స్పందనగా చూస్తారు కానీ మనసు తేలిక పడేందుకు కన్నీటిని మార్గంగా ఎంచుకుంటుంది .ఒక్కసారి తీవ్రమైన నిస్సహాయత ఆందోళన, వేదన, భయం, దుఃఖం కలుగుతాయి .ఈ ఉద్వేగాలను అణచిపెట్టటం అనవసరం .వాటిని బయటికి తెస్తేనే స్వాంతన లభిస్తుంది .లాక్ డౌన్ లో ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఇంట్లో బందీగా ఉన్నారు పంచుకొనేందుకు మనుషులు కనిపించక దిగులుగా ఉంటుంది .మిత్రులతో ఈ బాధ పంచుకుంటూ గట్టిగా ఏడ్చినా పర్లేదు .అవి ఉద్వేగ మలినాలను బయటికి తెస్తాయి