ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను దేవభూమిగా ప్రార్థిస్తాం.యమునోత్రి,గంగోత్రి,కేదార్నాథ్,బదరీనాథ్ ని కలిపి చార్ ధామ్ అని అంటారు. 

బద్రినాథ్ మంచు కొండలో నుండి 9 కిలోమీటర్లు కాలి నడకన వెళ్ళి సుమారు 10,000 ఎత్తైన కొండను లక్ష్మివన్ అంటారు. ఈ ప్రదేశంలో  ద్రౌపది ప్రాణ త్యాగం చేసిందని అంటారు.  ఈ ప్రదేశం నుండి అనేక సహస్రధారలు వేలాదిగా జలపాతాలు ప్రవహిస్తూ చక్రతీర్థ్ ను చేరుకుంటాము.ఇక్కడ జులై,ఆగష్టు నెలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.ఈ ప్రదేశంలోనే శ్రీ కృష్ణుడు అర్జునుడికి చక్రప్రయోగ విద్యను ప్రసాదించాడు అని అంటారు.ఇక్కడ కేవలం 9 మంది విశ్రాంతి తీసుకోవటానికి ఒక గుహ వున్నది.చిట్ట చివరికి స్వర్గారోహణ్ చేరుకుంటాము.మహాభారతంలోని చివరి ఘట్టం ఇక్కడే జరిగింది.చార్ ధామ్ ను చుట్టి రావటం చాలా కష్టమైనదని ప్రత్యక్ష సాక్షులు చెప్తారు.

నిత్య ప్రసాదం:ఇష్టదైవాన్ని స్మరిస్తూ పండ్లు సమర్పించుట

                  -తోలేటి వెంకట శిరీష

Leave a comment