Categories
సైక్లింగ్ పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు పరిపూర్ణమైన వ్యాయామం .సైకిల్ తొక్కటం వల్ల ఒక కాళ్ళకే కాక శరీరం లోని ప్రతిభాగానికి వ్యాయామం లభిస్తుంది .కండరాల పని తీరు మెరుగవుతుంది .పిరుదులు మోకాలి జాయింట్ల మొబిలిటీ బావుంటుంది .కొవ్వు కరిగించటం లో తిరుగులేని మార్గం సైక్లింగ్ దానివల్ల గంటకు 300 క్యాలరీలు ఖర్చవుతాయి .ఈ లాక్ డౌన్ సమయంలో ఇండోర్ బైస్కిల్ ఎంతో ఉపయోగ పడుతుంది .ఇది ఎక్స్ లెంట్ ఏరోబిక్ వర్కవుట్ శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా సాగుతుంది .