Categories

ఆకుపచ్చగా, పసుపు వర్ణంలో, చక్కని సువాసనతో రుచితో పుల్లగా తియ్యగా చక్కని రసం తో ఉండే బత్తాయి పండు తప్పని సరిగా రోజు కొక్కటి అయినా తినండి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ పండు వాసన చూసినా తిన్న శరీరానికి తక్షణ శక్తి అందుతుంది విటమిన్ సి పుష్కలంగా క్యాల్షియం, పొటాషియం, కాపర్ వంటి ఖనిజ పోషకాలు మెండుగా ఉంటాయి.ఈ విటమిన్లు ఖనిజాలు ఎంతో రోగ నిరోధక శక్తిని ఇస్తాయి.ఈ పండులోని విటమిన్ సి యాంటి ఆక్సిడెంట్స్ గా పని చేసి ఫ్రీరాడికల్స్ ను నిర్మూలించి రోగనిరోధకతను పెంచుతోంది రోగకారక క్రిములతో పోరాడే ఫాగో సైట్స్ పనితీరును విటమిన్ సి మెరుగుపరుస్తుంది ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడుతోంది.