ఎం.నేత్ర మధురలోని మేడవుడై నివాసి వయసు 13 సంవత్సరాలు ఈమె ఐక్యరాజ్యసమితిలో గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితురాలైంది నేత్ర త్యాగశీలతాకు దక్కిన గౌరవం ఇది. క్షవర వృత్తిలో ఉన్న ఆమె తండ్రి మోహన్ కూతురి చదువు కోసం ఐదులక్షలు కూడా పెట్టాడు. కరోనా వల్ల లాక్ డౌన్ లో ఎంతో మంది ఆకలితో అలమటించే వాళ్లను చూసి నేత్ర తండ్రిని చదువు కోసం దాచిన డబ్బు తో వాళ్ళకు సాయం చేద్దామని కోరింది తల్లి తండ్రి సరే అన్నారు.ప్రతి రోజు 500 మందికి సాయం అందించింది. ఈ తండ్రీ కూతుళ్ళ గురించి తెలుసుకున్న ప్రధాని వీరిని ప్రశంసించారు ఆమె గుడ్ విల్ అంబాసిడర్ అయింది.అంతేకాదు న్యూయార్క్ జెనీవాలో సివిల్ సొసైటీ ఫార్మ్స్ అంశంపై ప్రసంగించే అవకాశం వచ్చింది.తమిళనాడు ప్రభుత్వం ఆమె విద్యాభ్యాసానికి అవసరమైన చేయూత ఇస్తామని ప్రకటించింది.