Categories
మగవాళ్లు చేసే శానిటైజేషన్ ఆడవాళ్లు చేస్తే బాగుండదు అన్నారు. కానీ నేను వినలేదు.లక్నో లోని 20 కి పైగా వీధులు రోడ్లు ఆ దారి లో ఉన్న దేవాలయాలు స్కూళ్లను 60 లీటర్ల శానిటైజర్ తో శుభ్రం చేశాను .నేను దాచుకున్న డబ్బు తోనే అంటుంది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఉస్మా సయ్యద్ పర్వీన్ .హిందూ దేవాలయాల్లో బుర్ఖ ధరించిన మహిళా కనిపించడం చాలా అరుదు ఒక సామాజిక కార్యకర్త అయినా సయ్యద్ పర్వీన్ గుడి పరిసరాలను శుభ్రం చేయటాన్ని అంతా మెచ్చుకున్నారు. అందరూ కలిసి పోరాడితే తప్ప కరోనా నుంచి రక్షణ ఉండదు అంటూ స్వచ్ఛందంగా ఈ పనిలోకి దిగారు ఉస్మా సయ్యద్ పర్వీన్. వీధులను శానిటైజ్ చేస్తున్న ఆమె ఫోటోలు పేస్ బుక్ లో వైరల్ అయ్యాయి .