Categories
ఓట్స్,తృణ ధాన్యాలజాతికి చెందినవి . పుష్కలంగా పోషకాలు ఉంటాయి . 30 గ్రాముల ఓట్స్ లో సుమారుగా 117 కేలరీల శక్తి లభిస్తుంది . పీచు చాలా ఎక్కువ . అలాగే పిండిపదార్దాల మిశ్రమం వల్ల ఇవి అరిగి సాధారణ చక్కెరలు గా శరీరంలో మారతాయి . దీనివల్ల మధుమేహం ఇబ్బంది పెట్టదు . ఓట్స్ బీటా గ్లూకాన్స్ అనే కరిగే పీచు పదార్దాలు ఉన్నాయి . ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి . ఇందులో మంచి మాంసకృత్తులు పదకొండు నుంచి పదిహేడు శాతం లభిస్తాయి . ఆరునెలల పాపాలకు ఓట్స్ తో చేసిన ఆహారాన్ని అందిస్తే చిన్నతనంలో వచ్చే ఉబ్బసం రాదు . ఉదయపు ఆహారంగా ఓట్స్ మంచిది . భారీగా తినటం కాకుండా కొద్దిగా తింటేనే కడుపు నిండిన భావన కలుగుతుంది . బరువు తగ్గాలనే వారికీ అనువైన ఆహారం .