లాక్ డౌన్ తో పిల్లలు ఇళ్ళల్లోనే ఉండిపోతున్నారు. చుట్టుపక్కల పిల్లలతో కూడా కలిసి ఆడుకునే అవకాశాలు చాలా తక్కువే. ఇంట్లోఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటే పరవాలేదు గానీ ఏకైక సంతానం అయితే మటుకు తల్లిదండ్రులే స్నేహితులు గా వారితో గడప కాకపోతే కష్టం.పిల్లలకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి.సాయంత్రం ఉదయం వారితో చిన్న వ్యాయామాలు చేయించాలి. మధ్యాహ్నం వేళల్లో వాళ్లలో సృజనాత్మకత పెంచే పనులు అప్పగించాలి బొమ్మలు వేయడం, రంగులు నింపటం, బొమ్మలు చెయ్యటం, చదరంగం వంటి పనులు నేర్పించాలి.ఇల్లు సర్దటం దగ్గర నుంచి కూరగాయలు తరగటం వరకు ప్రతి పనిలో వాళ్ళను భాగస్వాములను చేయాలి. చదువుకునే సమయంలో అలా వదిలేయకుండా దగ్గర ఉండి చదివించాలి. ఇప్పుడు వాళ్లు స్కూల్ లకు వెళ్ళటం లేదు పర్యవేక్షణ లేదు తోటి పిల్లలతో ఆట పాటలు లేవు అంచేత పిల్లలకు తల్లితండ్రులే ఆసరాగా ఉండాలి.
Categories