శరీరపు రంగుకు ప్రాధాన్యత ఇచ్చే అన్ని ధోరణులు తగ్గుముఖం పడుతున్నాయి. అందం అంటే తెలుపే నన్న మాట వెనక బడింది. ఈ రంగు తో ఎవ్వళ్లనీ వేరు చేయద్దనే ఉద్యమాలు నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రసిద్ధ యం ఎస్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ చర్మాన్ని తెల్లబడే సౌందర్య సాధనాల విక్రయాన్ని నిలిపివేయునున్నట్లు ప్రకటించింది. అలాగే హిందుస్థాన్ లివర్ సంస్థ తమ ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ నేమ్ లోంచి ఫెయిర్ అన్న పదాన్ని తొలిగిస్తామని ప్రకటన విడుదల చేసింది. ఫెయిర్ ,వైట్ లైట్ అన్న పదాలు అందానికి నిర్వచనాలుగా వాడటం సరి అయినది కాదని ఈ నిర్ణయం తీసుకొన్నామని ప్రకటించింది కంపెనీ,బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం విస్తృతం అవుతుండటంతో రంగుకు ప్రాధాన్యత ఇచ్చే ధోరణులు అన్ని రంగుల్లో మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి.
Categories