Categories
లాక్ డౌన్ సమయంలో జిమ్ కు వెళ్ళటం ఇంట్లోనే అన్ని రకాల వర్క్ వుట్స్ చెయ్యటం కష్టం అలాంటప్పుడు సరదాగా డాన్స్ ప్రాక్టీస్ చేయండి పాటలకు అనుగుణంగా నాలుగు స్టెప్స్ వేయండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. డాన్స్ శరీరాన్ని తేలిక చేస్తుంది కండరాలను సౌకర్యంగా మారుస్తుంది. డాన్స్ లోని వివిధ భంగిమలను ఒకటికి పది సార్లు చేయడం వల్ల కండరాలకు మర్దన ఫలితం అందుతోంది.మెదడు శరీరం మధ్య సమన్వయం కుదురుతోంది ఏకాగ్రత పెరుగుతోంది. శరీరానికి తగినంత శ్రమ అందుతోంది కనీసం ఇరవై నిమిషాలు చేయగలిగితే చాలు ఇందులో నైపుణ్యం ఉండనవసరం లేదు పాటకు సంగీతానికి తగ్గట్లు శారీరక కదలికలు ఉంటే చాలు గాలికి అలవోకగా తలలూపే వృక్షాలకు నృత్యం ఎవరు నేర్పించలేదు సహజంగా వచ్చింది అంతే !