Categories
గర్భిణీగా ఉన్నప్పుడు వ్యాయామం చేసిన వాళ్లలో కాన్పు తర్వాత తల్లిపాలలో కె ఎస్ ఎల్ అనే బలిగా శాక్రైడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నట్లు ఒహియో స్టేట్ యూనివర్శిటీ వెక్స్నర్ మెడికల్ సెంటర్ అధ్యాయనం పేర్కొంటోంది పిల్లలు పెద్దయ్యాక మధుమేహం ఊబకాయం గుండెజబ్బులు వంటి వ్యాధుల ముప్పులు తగ్గటానికి ఇది దోహదం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. తల్లిపాలలో కె ఎస్ ఎల్ స్థాయిలు పెరగటానికి కష్టమైన వ్యాయామాలు చేయవలసిన పని లేదు,నడవటం వంటి తేలికైన వ్యాయామాలు చేసినా చాలు కాన్పు తర్వాత ఈ వ్యాయామాల తోనే తల్లి బరువు పెరగదు,పైగా బిడ్డకు కూడా మేలు జరుగుతుందంటున్నారు అధ్యయనకారులు.