Categories
శానిటైజర్ రాసుకుంటే హాయిగా మనుషుల్లో తిరగచ్చు అనుకుంటే ప్రమాదమే అంటున్నారు అధ్యయనకారులు.చేతుల పై రుద్దే శానిటైజర్ రెండు నిమిషాలు మాత్రమే రక్షణ కల్పిస్తుంది. పైగా అన్ని రకాల బ్యాక్టీరియా ను వైరస్ ను ఇది చంపలేదు. పూర్తిగా దీన్ని నమ్ముకుని లాభం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు సబ్బు నీళ్లతో చేతులు శుభ్రం చేసుకోవచ్చు కానీ బయటకు వెళ్ళినప్పుడు సబ్బు నీళ్ళు దొరకవు కనుక శానిటైజర్ వాడుకోవాలి. వైరస్ ల బారిన పడకుండా చేతులతో మొహం తాకకుండా ఉండాలి లిఫ్ట్ లు ఉపయోగిస్తున్నప్పుడు, తలుపులు హ్యాండిల్స్ ముట్టు కోవలసిన అవసరం వచ్చినప్పుడు శానిటైజర్ రాసుకోవాలి.