ఉదయపు అల్పాహారం గా పీచు తో కూడిన ఓట్స్ తీసుకుంటే శరీరానికి కావలసిన పోషణ శక్తి అందుతోంది.ప్రాసెస్ చెయ్యని ఓట్స్ లో పోషకాలు మెండుగా ఉంటాయి అలాగే పండ్లు పెరుగు సమ్మేళనం ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పుకోవచ్చు.పెరుగులోని ప్రోబయోటిక్స్ పీచు ఫాలి ఫినాల్స్ జీర్ణక్రియకు తోడ్పడతాయి ఉదయాన్నే దోసెలు ఇడ్లీలు కూడా మంచి ఆహారం. వీటి నుంచి ప్రోటీన్ లు కార్బోహైడ్రేట్స్ అందుతాయి. త్వరగా జీర్ణం అవ్వడమే కకుండా ఇమ్యూనిటీ ని ఇస్తాయి.రుచిగా కూడా ఉంటాయి ఉదయం తీసుకొనే అల్పాహారం మే రోజంతటికీ పని చేసే శక్తిని ఇస్తుంది.