Categories
పరిచయస్తులు ఎదురైతే నవ్వుతాం. కొన్ని భావాలు మాటలు లేకుండానే వ్యక్తం చేస్తాం. కానీ మాస్క్ లతో ఆ సౌకర్యం పోయింది.మనం నవ్వినా వాళ్ళు నవ్వినా ఏది అర్థం కాదు.మాస్క్ మొహంలోని భావోద్వేగాల్ని చాలావరకు కప్పేసింది. ఆఫీసుల్లో మీటింగ్ ల్లో, లేదా ఎదుటి మనుషులతో మాట్లాడేప్పుడు అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనసులో భావాలను ఫేస్ రీడింగ్ ద్వారానే అంచనా వేయొచ్చు. కానీ మాస్క్ లతో అది కష్టం. ఇప్పుడు నేరుగా అవతల వాళ్ల కళ్ళలోకి దీక్షగా చూడటం తప్ప గత్యంతరం లేదు కనుక మాటలు మాట్లాడటం ద్వారానే అర్థం చేసుకోవాలి. కనుక మనుషులు కనబడగానే ముందుగా మాట్లాడటం, పలకరించటం చేయాలి ఇప్పుడు మన మౌనం కంటే మాటలే అవసరం అంటున్నారు ఎక్సపర్ట్స్.