Categories
జుట్టుకు పోషణ ఇచ్చే హెయిర్ కండీషనర్ తో ఇతర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్ .పగిలిన పాదాలకు కండిషనర్ పోషణను అందించి మృదువుగా మార్చేస్తాయి.రాత్రి వేళ పాదాలకు ఈ కండిషనర్ పూసి సాక్స్ లు వేసుకోవాలి.ఇలా ప్రతిరోజూ చేస్తే పాదాలు మృదువుగా మారిపోతాయి అలాగే కాలి వేళ్ళకు గోళ్ళకు కండిషనర్ రాసి మర్దనా చేస్తే గోళ్లు బలంగా చక్కగా కనిపిస్తాయి.ఈ కండిషనర్ బాడీ స్క్రబ్ లాగా కూడా వాడుకోవచ్చు.కండిషనర్ లో కొద్దిగా బ్రౌన్ షుగర్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కాళ్లకు చేతులకు రాసుకొని మృదువుగా మర్దనా చేస్తే శరీరం పైన ఉండే మృతకణాలు మురికి పోయి చర్మానికి మృదుత్వం వస్తుంది.