Categories
కరోనా ప్రభావం తో సి-విటమిన్ ఎక్కువ ఉండే ఎన్నో పండ్లకు గిరాకీ వచ్చింది చిట్టి మిరపకాయ లాగా బుల్లి టమాటో లాగా వుండే వోల్ఫ్ బెర్రీ ఇప్పుడు సూపర్ ఫుడ్ గా నిలబడింది.అన్ని రకాల పోషకాలు ఉండే ఈ పండు చర్మకాంతి కి శిరోజాల పెరుగుదలకు సహాయపడుతుంది. హిమాలయ సానువుల్లో పెరిగే ఈ పండు కొంచెం తియ్యగా కొంచెం పులుపుతో ఉంటుంది. గాజీ పండుగ పిలిచే ఇది రెండు పండ్ల రూపంలో మనకు దొరుకుతుంది. ఈ పండు రోగనిరోధకశక్తిని పెంచి ఫ్లూ వైరస్ ల నుండి కాపాడుకోగలిగే శక్తిని ఇస్తాయి. చైనా సంప్రదాయ వైద్యంలో డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యల నివారణకు ఈ పండును మందుగా ఇస్తారు. దీన్ని దేవతలు తినే పండుగ చెబుతారు.