మిర్జాపూర్ హస్తకళలకు పెట్టింది పేరు.వారసత్వ నైపుణ్యం తో నిండిన అందమైన మీర్జాపూర్ తివాచీలు రగ్గులు. ఫ్లోర్ మ్యాట్స్ ఇకపై ప్రపంచ వేదిక పైన తమ గొప్పతనం చాటనున్నాయి మిర్జాపూర్ లోని ‘గరీబ్ ప్రేరణ స్వయం సహాయ సమూహ్ ,తివాచీలు గోడలకు అలంకారంగా వేలాడ దీసే పట్టాలు తయారుచేస్తారు. ఈ బృందానికి నాయకత్వం వహిస్తుంది డైరెక్టర్ అఫ్సానా బేగం. వచ్చే ఏడాది జపాన్ లో ఏర్పాటయ్యే జపాన్ కార్పెట్ ఫెయిర్ లో ఈ బృందం తయారు చేసిన ఉత్పత్తులు ప్రదర్శించబోతున్నారు.గతంలో పర్షియిన్ల డిజైన్ లనే ఆకర్షణీయమైన రంగులతో పొందికైన అల్లికలతో మన్నికగా మెత్తదనం తో ఉండే కార్పెట్ లు తయారు చేసేవారు ఇప్పుడు ప్రసిద్ధమైన మీర్జాపూర్ కళ ఆధునిక డిజైన్ లతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.