కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ లు వేసుకొని షూటింగ్ లకు వెళ్తున్నాం నిజానికి షూటింగ్ ప్లేస్ ల్లో కూడా లొకేషన్ తరచూ శానిటైజర్ చేస్తున్నారు. ఎంత చేసిన కెమెరా ముందుకు వెళ్ళగానే ఆర్టిస్ట్ లం  మాస్క్ లు తీయవలసిందే కదా లైఫ్ స్టైల్ మారిపోతోంది అంటుంది రాశికన్నా. నాకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువే. ఇప్పుడు కోవిడ్  అని ప్రత్యేకం ఏమీ లేదు ఎప్పటి నుంచో వేడి నీళ్లు తాగటం అలవాటు శాకాహారి గా మారి ఏడాదిన్నర అయ్యింది. ఫిట్ గా ఉండేందుకు మన ఆహారపు అలవాట్లే మనకు ఉపయోగపడతాయి వైరస్ అటాక్ చేస్తే తట్టుకునే అంత శక్తి మన దగ్గర ఉండేలా ఆరోగ్యమైన జీవనవిధానం పాటించటం తప్ప ఇంకే చేయగాలం అంటోంది రాశికన్నా .

Leave a comment