Categories
భక్తి నీ, దొంగ స్వాములు దందాలను కలిపి తీసిన సినిమా అమ్మోరు తల్లి. రామస్వామి ఒక చిన్న టీవీ ఛానల్లో రిపోర్టర్ గా పని చేస్తూ ఉంటాడు.భగవతి బాబా ఆక్రమించుకున్న 11 వేల ఎకరాల భూమి గురించి అతని మోసాల గురించి ఓ కథనం ప్రసారం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.అతనికి ముగ్గురు చెల్లెలు తండ్రి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో తాత తల్లితో పాటు అందరినీ పోషించే భారం రామస్వామి దే. ఇంట్లో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోవాలంటే తమ కులదైవం ముక్కుపుడక అమ్మవారిని దర్శించుకోవాలని తల్లి పట్టుబట్టడంతో అందరూ గుడికి వెళ్తారు అక్కడ రామస్వామి ముక్కుపుడక అమ్మవారు ప్రత్యక్షమౌతుంది. తన గుడికి తిరుపతి గుడి అంత గొప్ప పేరు రావాలని అలా వచ్చేలా చేయమని రామస్వామిని కోరుతుంది. గుడికి పేరు తెచ్చేందుకు దేవుడి మాన్యం కాపాడేందుకు రామస్వామి పడ్డ తిప్పలే అమ్మోరు తల్లి సినిమా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా కథ కొత్తగా బావుంది తప్పకుండా చూడవలసిన సినిమా.
రవిచంద్ర.సి
7093440630