కాశ్మీర్ సరిహద్దుల్లో భారత సైన్యానికి సేవలందిస్తోంది కెప్టెన్ డాక్టర్ కృష్ణవేణి. తిరుచ్చి సమీపంలోని తొట్టియం గ్రామానికి చెందిన కృష్ణవేణి బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంది. పెరంబలూర్ లోని ప్రభుత్వ హాస్టల్ లో చదువుకుంది. నటుడు సూర్య డైరెక్టర్ గా ఉన్న అగరం పౌండేషన్ సహాయంతో తిరుచ్చి ఎం ఆర్ ఎం మెడికల్ కాలేజీలో చదువుకునే భారత సైనిక విభాగం లో డైరెక్టర్ గా ఎంపికయింది. సంవత్సరం పాటు అక్కడ పనిచేశాక సరిహద్దుల్లో సైనికులకు సేవలందించేందుకు శిక్షణ తీసుకుని క్యాప్టెన్ కృష్ణవేణి గా మారిపోయింది. త్వరలోనే మేజర్ గా ప్రమోషన్ పొందిన కృష్ణవేణి తల్లిదండ్రులు లేని పిల్లల చదువుల కోసం స్వచ్ఛంద సంస్థ స్థాపిస్తానని చెబుతోంది.