కాస్తా టైమ్ దొరికితే ఏంచేస్తారు. ఏదో ఒక ముఖ్యమైన పని చేయాలనుకుంటారు, ప్లాన్ లు వేస్తారు నేనయితే ఆ ఖాళీ సమయాన్ని ఖాళీగానే గడుపుతాను, ఇంకేం పనులు పెట్టుకోను అంటుంది అనుష్క. ఏదైన రెగ్యూలర్ వర్క్ లు ఉంటే ఇక దానిపైనే మనసంతా తిరుగుతూ ఉంటుంది. అందుకే నాకు కాస్తా ఖాళీ దొరికితే ఇక నా గురించి నేనే ఆలోచించుకుంటా అంటుంది. వేరే పనులు లేకుండా ఖాళీగా అంటు ఉంటే నన్ను నేను వెతుక్కునేందుకు నాలో నేను మాట్లాడుకునేందుకు తగిన సమయం కేటాయించుకొంటూ నిజానికి నన్ను నేను కాస్తా మెరుగుపెట్టుకుని కాస్తా మనసు పెట్టి నాలోకి నేను చూసుకునే సమయం అదే, అందుకే సమయం దొరికింది అంటే నాకోసం నేనే ఏకాంతంగా ఉండటంకోసం అంటోంది అనుష్క. ఇప్పుడో ద్విభాషా చిత్రం చేయబోతుంది అనుష్క.

Leave a comment