ప్రపంచం మొత్తం మీద 1200 రకాల పుచ్చకాయలు ఉన్నాయి, మనకు ఎర్రనివే కనిపిస్తాయి. తెలుపు,నారింజ,పసుపు,గులాబీ రంగుల గుజ్జుతో పై భాగం ముదురు ఆకుపచ్చ, ఆకుపచ్చ మీద తెలుపు గీతలు, పసుపు పచ్చనివి , ఉదా రంగువి, పెద్ద మచ్చలు , చుట్టు చుక్కలు ఇలా ఒక్కో పండు ఒక్కో రుచి , ఒక్కో వర్ణం, ఇందులో 90 శాతం నిరు వీటిల్లో ఉండే బీటా కెరోటిన్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. కెరోటినాయిడ్లు, విటమిన్ సీ, పోటాషియం కొవ్వులను కరిగిస్తాయి. నీటితో నిండి ఉండే పుచ్చకాయలో విటమిన్ ఏ, సి, బీ, కాల్షియం , మెగ్నిషియం ,నియాసిన్ ,లైకోపిన్ ,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఈ వేసవిలో నోరుతియ్యగా, దాహం తీర్చే పుచ్చకాయతో సెలబ్రెట్ చేసుకోవాలి.

Leave a comment