హరి అనే చిన్నఅబ్బాయి చెబుతున్న స్టోరీలా నడుస్తుందీ సినిమా. హరి తండ్రి ఇమ్రాన్ ముస్లిమ్ తల్లి పార్వతి హిందూ భారతదేశాన్ని అపారంగా ప్రేమించే వారి తల్లిదండ్రులు ఒక చక్కని ఫీచర్ ఫిలిమ్ తీయాలి అనుకుంటారు మనుషుల మంచితనం తప్ప కులం మతం అనే విశ్వాసాలు లేని ఇద్దరు భార్యాభర్తలు ఇటు హిందువులుగా ఆట ముస్లిమ్ లుగా ఎవరి కులం ఆదరణ పొందలేకపోతున్నారు అంతులేని మత అసహనాన్ని ఎదుర్కొంటారు ఎన్నో ఆర్థిక పరమైన చిక్కుల్లోపడతారు. సినిమా కారణంగా ఇళ్ళు కూడా అమ్మేస్తారు తండ్రి వెనకే ఉంటూ హరి తన చుట్టూ ఉన్న మనుషుల్లో అసహనాన్ని చూస్తాడు.పొరుగింట్లో ఉండే స్నేహితురాల సాయంతో తన పేరు హరి అని,తల్లి తండ్రులు ఫలానా కులానికి చెందిన వాళ్లనీ కానీ వాళ్లకు ఎలాంటి మతవిశ్వాసాలు లేవనీ, తండ్రి తీయాలనుకున్న సినిమాకి సాయం చేసి అద్భుతమైన ఆ సినిమా పూర్తి చేసేలా సహాయం అందజేయమని క్రౌడ్ ఫండింగ్ కోసం ఒక వీడియో అప్లోడ్ చేస్తాడు. ఆ తెల్లవారే మత అసహనంతో ఉన్న ఒక వ్యక్తి తండ్రిని పేల్చేయటానికి గురిపెట్టిన పిస్టల్ షాట్ తగిలి మరణిస్తాడు. ఒక తెలివైన పిల్లవాడి మరణం అలా జరుగుతుంది. ఆ అబ్బాయి మరణం తర్వాతే అతని పెట్టిన వీడియో వైరల్ అయి కోట్లకొద్దీ డబ్బు అతని అకౌంట్ లోకి వచ్చిందని తెలుస్తోంది. అద్భుతమైన, తిరుగులేని ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది తప్పకుండా చూడండి.

రవిచంద్ర .సి
7093440630

Leave a comment