Categories
నిరంతరం ఏదో పని చేస్తూ, కడుగుతూ తుడుస్తూ ఉంటే చేతిలు బరకగా అయిపోతాయి. అలా మృదుత్వం పోయిన చేతులు మెత్తగా అవ్వాలంటే ఈ రెండు టిప్స్ పనికొస్తాయి అంటారు ఎక్సపర్ట్స్.టీ స్పూన్ పంచదార లో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో చేతులను మర్దనా చేయాలి. క్రమం తప్పకుండా చేస్తే చేతులు మృదువుగా ఉంటాయి. పాత్రలో కొద్దిగా తేనె,కోడి గుడ్డు లోని తెల్లసొన గ్లిజరిన్ ఒక స్పూన్ ఓ టీ స్పూన్ బార్లీ పౌడర్ కలిపి ఆ మిశ్రమం తో ప్రతి రోజు చేతులు మసాజ్ చేస్తే చేతులు మృదువుగా ఉంటాయి.