చలికి జుట్టు చివర్లు చిట్లి పోతాయి.చుండ్రు దురదా సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు జుట్టుకు పదేపదే షాంపూ చేయొద్దు ఇలా చేయటం వల్ల షాంపూ లోని రసాయనాలు మాడుపైన ఉండే సహజ నూనెలను పీల్చేసి జుట్టును పొడిబారేలా చేస్తాయి. వారంలో ఒకసారి షాంపూ చేస్తే చాలు తప్పకుండా జుట్టుకు కండిషనర్ పట్టించాలి హీట్ స్టయిలింగ్ టూల్స్ సాధ్యమైనంత తక్కువ ఉపయోగించటం మంచిది ప్రతి వారం తప్పనిసరిగా కండిషనర్ తో కూడిన హెయిర్ మాస్క్ వేసుకోవాలి గుడ్డు వంటి ప్రకృతి సహజ మైన వస్తువులే ఉపయోగించాలి. తలస్నానానికి గోరువెచ్చని నీళ్ళు ఉపయోగించాలి.రెండు నెలలకోసారి జుట్టు ట్రిమ్ చేయాలి. శిరోజాలు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే మాంసకృత్తులు ఉండే ఆహారాన్ని ప్రాధాన్యం ఇవ్వాలి.

Leave a comment