Categories
కొన్ని వంటింటి చిట్కాలతో వంట పని ఈజీగా పూర్తి చేయొచ్చు.పూరీలు తెల్లగా ఉండాలంటే ఆ వేయించే నూనెలో కొన్ని జామాకులు వెయ్యాలి. సగ్గుబియ్యం కాసేపు నీటిలో నానబెట్టి ఉడికించే ప్పుడు అందులో ఒ స్పూన్ నెయ్యి వేస్తే గింజలు అతుక్కుపోకుండా ఉంటాయి. వంకాయ ముక్కలు కొయ్య గానే నల్లబడతాయి. వాటిని నీటిలో ఉంచి తరగాలి.ముక్కలు నీళ్లలోనే ఉంచాలి తాలింపు వేసి పాలు పోస్తే కూర నల్లబడకుండా ఉంటుంది. రుచిగా ఉంటుంది.పుదీనా పచ్చడి కి కప్పు పెరుగు కలిపితే దాని రంగు రుచి బావుంటాయి బెండకాయ ముక్కల్లో మజ్జిగ వేసి కూర వండితే జిగురు ఉండదు.