Categories
విషాద పరిస్థితుల్లోనే ఏడుపు వస్తుందనేది నిజం కాదంటున్నారు పరిశోధకులు. భయపడినప్పుడు గట్టిగా అరవటం వంటివి భావోద్వేగమే ఏడుపు కూడా. తీవ్ర వత్తిడికి గురైనప్పుడు గట్టిగా అరిచి చివరకు కళ్ళ నీళ్లు పెట్టుకొంటారు. అలాగే ఆనందం తో కూడా గట్టిగా అరుస్తారు. కన్నీళ్లు పెట్టుకొంటారు. ఇలాటి అరుపులు ఏడుపులు భావోద్వేగ సమతుల్యం ఇస్తాయంటారు. ఏ ల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఎక్కువ సమయం భావోద్వేగ తీవ్రతతో ఉండటం మంచిది కాదు అందుకే కన్నీరు ఏడుపు చాలా అవసరం అంటారు పరిశోధకులు. మనసు వత్తిడికి గురైనప్పుడు ఒక రకపు హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. అలా ఉత్పత్తి అయిన హార్మోన్స్ కంటినీరు ద్వారా బయటికి పోతాయి. ఒత్తిడి ఏడుపుతో పోవటానికి ఇదే కారణం అంటున్నారు ఎక్సపర్ట్స్.