Categories
ఈ సీజన్ లో వచ్చే ద్రాక్ష పండ్లు తప్పకుండా తినండి అంటారు బర్మింగ్ హోమ్ లోని అలాఖమ్ విశ్వవిద్యాలయ నిపుణులు.. ఇవి అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడతాయి అంటారు. ద్రాక్షలో వుండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లనీ, మధుమేహం వంటి వ్యాధుల నుంచే కాదు,సూర్యరశ్మి లోని వేడికి చర్మ కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయట ఈ విషయాన్నీ నిర్ధారించుకొనేందుకు ద్రాక్ష తినక ముందు తిన్న తర్వాత కూడా చర్మ కణాల పైన యు.వీ కిరణాల ప్రభావం ఎలావుంటుందో చూశారట. రెండు వరాల పాటు క్రమం తప్పకుండ యు.వీ కిరణాల ప్రభావం చాలా తక్కువగా ఉందట ద్రాక్షని ఎడిబుల్ సన్ స్క్రీన్ గా చెప్పచు అంటున్నారు పరిశోధకులు.