మధుర్ మయి ఆదర్శ శిక్ష నికేతన్ నడుపుతోంది నిరోజ లక్ష్మి మహాపాత్ర 48 ఏళ్ల ఈ టీచర్ ఒరిస్సా లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పిల్లల కోసం భువనేశ్వర్ లో ఒక హోమ్ నడుపుతోంది. 2003 లో ప్రారంభం అయిన ఈ హోమ్ నడుపుతోంది. ఇప్పటికి రెండు వందల మంది ప్రయోజకులు అయ్యారు దేశంలోనే బహుశా ఇది ఖైదీల పిల్లలకోసం స్కూల్ గాచెప్పవచ్చు ఒరిస్సాలో 18 జైలు ఉన్నాయి శిక్ష అనుభవిస్తున్న వారి పిల్లలను ఈ హోమ్ లో ఉంచుకొని చదువుసంధ్యలు చెప్పిస్తారు. ఈ హోమ్ కు ఒరిస్సా లోని ఒక స్వచ్ఛంద సంస్థ మద్దతు ఉంది. నిరోజ భువనేశ్వర్ లో బదిరి పిల్లల కోసం జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసింది .ఆ కాలేజీ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బదరీ విద్యార్థులు జాయిన్ అవుతున్నారు.

Leave a comment