Categories
దేశంలోనే తొలి మహిళ ట్రక్ డ్రైవర్ యోగితా రఘువంశీ.. కామర్స్ లో డిగ్రీ చేసిన యోగిత లాయర్ అవ్వాలనే కోరిక తో లా చదివింది. భర్త మరణంతో డ్రైవర్ సీట్లో కూర్చోవలసి వచ్చింది. 16 ఏళ్ల క్రిందట ట్రక్ స్టీరింగ్ పట్టుకున్న యోగిత అంతర్రాష్ట్ర రహదారులపై కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. మగవాళ్ళ కే పరిమితం గా ఉన్న రంగంలోకి తొలి మహిళగా దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించారు. యోగిత మహిళగా మహా నగరాల మధ్య ట్రక్ నడపాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. రహదారులు పక్కనే ఉండే మెకానిక్ ల దాబా దగ్గర మగవాళ్ళు వింతగా చూసే వాళ్ళు కానీ నేను పట్టించుకోలేదు నా పనిని ప్రేమించాను అంటుంది యోగిత.