మనలాగే నోరులేని ఎన్నో జీవులు,జంతువులు,పక్షులు అన్నింటికీ ఈ భూమి పైన సురక్షితంగా ఆరోగ్యంగా జీవించే హక్కు ఉన్నది వాటి సంరక్షణ కోసమే కన్సర్యేషన్ అండ్ రెస్క్యూ ( కౌర్) సంస్థ అంటోంది నిఖితా అయ్యర్ ఈ ఏడాది ఆపేరు ను హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ ( H W A) గా మార్చారు కర్నాటక లోని బళ్లారి లో ఉన్న ఈ సంస్థ లో ఆరువేలకు పైగా జంతువులు రక్షణ పొందాయి. వీధి జంతువుల కోసం బళ్లారి కేంద్రంగా పూర్తి సౌకర్యాలున్న సహాయక కేంద్రం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయడం లక్ష్యం ప్రభుత్వం స్థానిక సంస్థలు ప్రజలు సహకరిస్తే అది నెరవేరటం కష్టం కాదు అంటోంది నిఖిత అయ్యారు.