Categories
కొన్ని వంటింటి చిట్కాలతో వంట ఇంట్లో పని సులభం అయిపోతుంది. కిచెన్ క్యాబినెట్ పైన ముఖ్యంగా హ్యాండిల్స్ దగ్గర జిడ్డు వదలకపోతే బేకింగ్ సోడా లో కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి శుభ్రం చేయచ్చు సీలింగ్ ఫ్యాన్ తుడవాలంటే ముందు పాత దిండు కవర్ ఫ్యాన్ రెక్కలుకు తొడగాలి తర్వాత నెమ్మదిగా లాగితే దుమ్ము కింద పడకుండా కవర్ లోనే ఉండి పోతుంది ఐరన్ బాక్స్ పైన మరకలు జిడ్డు పోవాలంటే ఒక పిల్లో కవర్ పైన సాల్ట్ వేసి ఐరన్ చేస్తే ఉప్పు ఐరన్ బాక్స్ ను శుభ్రం చేస్తుంది. టైల్స్ మధ్యలో సన్నని గీతలు గా ఉన్న చోట మురికి వదలాలంటే బేకింగ్ సోడా లో బ్లీచ్ కలిపి పేస్ట్ మాదిరిగా చేసే గ్రౌట్ లైన్స్ పై పూసి, పది నిమిషాలు ఆగాక తుడిచేయాలి.