Categories
ఇలాంటి ఎండలో వడ దెబ్బ తగిలే అవకాశాలు ఎన్నో ఉంటాయి తీసుకునే ఆహారంలో ధరించే దుస్తులలో మార్పులు చేసుకుంటే సమస్య తక్కువ అవుతోంది. ఎక్కువ నీరు తాగాలి వేసవిలో త్వరగా శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. చెమట ద్వారా మినరల్స్ బయటికి పోయే అవకాశం ఎక్కువ కాబట్టి తాజా పండ్లు కూరగాయలు తీసుకుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. కెఫిన్ ఆల్కహాల్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి తక్కువ ఆహారం ఎక్కువ నీళ్లు తీసుకోవాలి మధ్యాహ్నం లంచ్ లో సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి. కీరదోస తో చేసిన సలాడ్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఎండలో నుంచి రాగానే చల్లగా ఉండే పానీయాలు ఐస్క్రీమ్లు తినకూడదు.