Categories
చర్మానికి రక్త ప్రసరణ కోసం డ్రై బ్రషింగ్ చాలా అవసరం అంటూరు ఎక్సపర్ట్స్. బాడీ బ్రషింగ్ కోసం ప్రత్యేకంగా డ్రై బ్రష్ లు ఉంటాయి. కుదుళ్లు కాస్త బిరుసుగా, పొడవాటి హ్యాండిల్ ఉన్న బ్రష్ ఎంచుకోవాలి. బ్రషింగ్ పాదాల దగ్గర నుంచి మొదలు పెట్టి మరి భరిపిడి గా లేదా మరీ సున్నితంగా కాకుండా తగినంత వత్తిడి తో మొదలు పెట్టాలి. పాదాలు, కాళ్లు, చేతులు దగ్గర పొడవాటి స్ట్రోక్స్ తో పొట్ట, ఛాతీ దగ్గర వృత్తాకారంలో బ్రషింగ్ చేయాలి. స్నానానికి ముందర ఈ బ్రషింగ్ చేస్తే స్నానంతో మృతకణాలు పోతాయి తడి ఆరే లోగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి లింఫ్ స్రావాలు సక్రమంగా స్రవించటం కోసం, చర్మపు ఆరోగ్యానికి డ్రై బ్రషింగ్ ఉపయోగపడుతుంది.
|
|