బయట అడుగుపెడితే ఎండవేడికి ముఖం వడలిపోతుంది. ఆ నలుపు వదిలించుకోవాలంటే రసాయనాలు లేని క్లెన్సర్లు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.కప్పు వెనిగర్ కొన్ని నీళ్ళలో కలిపి సీసాలో పోసి ఫ్రిజ్ లో నిల్వా చేస్తే చాలు ఎండలో నుంచి రాగానే ఆ చల్లటి నీళ్లలో ముఖం కడిగినా నలుపు తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుంది. నిమ్మరసం,తేనె కలిపి ముఖానికి రాసి ఒక పదినిమిషాలు ఆగి క్లీన్ చేస్తే చర్మానికి తేమ అంది కాంతివంతంగా తయారవుతుంది.పెరుగు కలబంద గుజ్జు కూడా చక్కని క్లెన్సర్.ఈ రెండు సమపాళ్లలో కలిపి ముఖానికి రాస అరగంట ఆగక కడిగేసి మాయశ్చరైజర్ రాసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.

Leave a comment