ప్రేరణాస్ హాండ్ క్రాఫ్టేడ్ ఐస్ క్రీమ్ ప్యూర్ వెజిటేరియన్ క్రీమ్ గా పేరు తెచ్చుకుంది. గురుగ్రామ్ కు చెందిన ప్రేరణా పూరి పాలు నీళ్ళు అవసరంలేని గ్లూటెన్ ఫ్రీ ఐస్ క్రీమ్ సృష్టించింది .కృత్రిమ రంగులు నిల్వ పదార్థాలు ఇందులో ఉండవు ఐస్ క్రీమ్ తయారీలో రంగులు ఆరోగ్యానికి చేటు చేస్తాయని ఇవేవీ లేకుండా ఐస్ క్రీమ్ తయారీ కోసం ఎన్నో ప్రయోగాలు చేశానని చెబుతోంది ప్రేరణా పూరి.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ లో డిప్లమా చేసిన ప్రేరణ లాక్ డౌన్ లో తన పిల్లల కోసం తయారు చేసిన ఈ ఐస్ క్రీమ్ భారతదేశ మొట్టమొదటి సర్టిఫైడ్ గ్లూటెన్ ఫ్రీ ఐస్ క్రీమ్ గా గుర్తింపు పొందింది.